లేటెస్ట్ : ఆ రీమేక్ లో నాగచైతన్య నటించడం లేదట

Published on Jun 6, 2023 1:30 am IST

టాలీవుడ్ యువనటుల్లో ఒకరైన నాగచైతన్య ఇటీవల కస్టడీ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ ని అయితే అందుకోలేకపోయింది. ఇక అతి త్వరలో నాగచైతన్య నెక్స్ట్ మూవీ అనౌన్స్ కానుంది. అయితే లేటెస్ట్ గా నాగచైతన్య కు సంబందించిన ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది.

దాని ప్రకారం ఇటీవల బాలీవుడ్ లో అనీస్ బజ్మీ దర్శకత్వంలో కార్తీక ఆర్యన్, కియారా అద్వానీ, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కి మంచి విజయం అందుకున్న భూల్ బులయ్య మూవీని తెలుగులో నాగచైతన్య, జ్యోతిక లు ప్రధాన పాత్రల్లో రీమేక్ చేయనున్నారని ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తాజాగా దీని పై స్పందించిన నాగ చైతన్య టీమ్ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, దయచేసి ఇటువంటి తప్పుడు కథనాలు నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు. దీనితో ఆ రీమేక్ మూవీకి సంబందించిన పుకార్లకు ఒక్కసారిగా చెక్ పడింది.

సంబంధిత సమాచారం :