టీజర్ కి టైమ్ ఫిక్స్ చేసిన “కస్టడీ” టీమ్

Published on Mar 13, 2023 8:00 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య హీరోగా డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కస్టడీ. ఈ చిత్రం లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ రాగా, చిత్రం కి సంబంధించిన టీజర్ పై చిత్ర యూనిట్ తాజాగా ఒక ప్రకటన చేయడం జరిగింది.

టీజర్ కి టీజ్ అంటూ ఒక వీడియో ను విడుదల చేయడం జరిగింది. టీజర్ ను మార్చ్ 16, 2023 న సాయంత్రం 4:51 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ చేసిన టీజ్ వీడియో సినిమా పై ఆసక్తి ను పెంచేసింది. టీజర్ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం లో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తుండగా, ఇళయరాజా, యువన్ శంకర్ రాజా లు సంగీతం అందిస్తున్నారు.

టీజ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :