ఫస్ట్ లుక్ కి చైతు ‘థాంక్యూ’ రెడీ !

Published on Nov 22, 2021 4:45 pm IST

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ‘థాంక్యూ’ సినిమా నుంచి ఒక అప్ డేట్ వచ్చింది. నవంబర్ 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీసి.. అక్కినేని ఫ్యామిలీకి గొప్ప సినిమా ఇచ్చాడు.

అలాగే అఖిల్ హీరోగా ‘హలో’ అంటూ అఖిల్ కి హిట్ ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. ఇక ఈ సారి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగ‌చైత‌న్యకి ‘థాంక్యూ’ అంటూ ఎలాంటి హిట్ ను ఇస్తాడో చూడాలి. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జరుపుకొంటోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగ్‌చైతన్య ముగ్గురు నాయికలతో రొమాన్స్ చేయనున్నారట.

సంబంధిత సమాచారం :

More