ఆకట్టుకుంటున్న నాగ చైతన్య “థాంక్యూ” టీజర్… మామూలుగా లేదుగా!

Published on May 25, 2022 5:33 pm IST

అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం థాంక్యూ. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. జీవితంలో అహంకారం ఉన్న ధనిక వ్యాపారవేత్తగా నాగ చైతన్య ను చూపించారు. అతను ఎదుగుతున్న సంవత్సరాలలో చాలా తప్పులు చేసాడు మరియు ఇవన్నీ టీజర్‌ లో బాగా ప్రదర్శించబడ్డాయి. అంతేకాక వివిధ వయస్సుల సమూహాలలో చూపించారు.

అవికా గోర్, మాళవిక నాయర్ మరియు రాశి ఖన్నా వంటి హీరోయిన్లు నాగ చైతన్య కి గర్ల్ ఫ్రెండ్స్ లాగా చూపించబడ్డారు. థమన్ అందించిన బీజీఎంతో టీజర్ క్లాస్‌గా కనిపిస్తోంది. జీవితంలో తాను ఎంత అహంకారం తో ఉన్నాడో తనకు తెలియజేసేలా చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపేందుకు చైతన్య ప్రయాణంలో ఉన్నట్లు టీజర్ లో కనిపిస్తోంది. కాన్సెప్ట్ చాలా బాగుంది మరియు దర్శకుడు విక్రమ్ కుమార్ టీజర్‌ను ఆకర్షణీయంగా కత్తిరించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని జూలై లో విడుదల కాబోతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :