‘నాగ చైతన్య’ పాత్ర ఆ సినిమా కథను మలుపు తిప్పుతుందట !

naga-chaitanya1
గత కొన్నాళ్లుగా అక్కినేని హీరో ‘సుశాంత్’ సరైన హిట్ లేక తడబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువ హీరో దర్శకుడు ‘నాగేశ్వర రెడ్డి’ దర్శకత్వంలో ‘ఆటాడుకుందాం రా..’ అనే చిత్రాన్న్ని చేశాడు. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని యువ హీరోలైన ‘నాగ చైతన్య, అఖిల్’ ఇద్దరూ కనిపించనున్నారు. ముఖ్యానంగా నాగచైతన్య పాత్రయితే కథకు కనెక్టయి ఉంటుందని చిత్ర నిర్మాత ‘చింతలపూడి శ్రీనివాస రావు’ తెలిపారు.

చైతన్య పాత్ర కథలోకి ఎంటరవగానే సినిమా ఊహించని మలుపు తీసుకుంటుందని, ఇది ప్రేక్షకులకు మంచి థ్రిల్ ము ఇస్తుందని అన్నారు. అలాగే ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఎంటటైన్మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుందని, ఇది అక్కినేని అభిమానులు ఓ పండగలా ఉంటుందని హీరో సుశాంత్ తెలిపారు. ఇకపోతే ‘అనూప్ రూబెన్స్’ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది.