దయచేసి దానిని ఎవరూ ఫాలో కావొద్దు – నాగ చైతన్య

దయచేసి దానిని ఎవరూ ఫాలో కావొద్దు – నాగ చైతన్య

Published on Aug 10, 2022 7:00 PM IST

అక్కినేని నాగ చైతన్య ఇటీవల విక్రమ్ కె కుమార్ తీసిన థాంక్యూ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే ఆ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీలో బోడి బాలరాజు అనే పాత్రలో కనిపించనున్నారు చైతన్య. ఎంతో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న లాల్ సింగ్ చడ్డా పై ప్రేక్షకాభిమానులు అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీ రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కి రెడీ అవడంతో నేడు మీడియాతో ముచ్చటించారు నాగచైతన్య. ఈ మూవీలో చేసిన బోడి బాలరాజు పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనని, నిజంగా లాల్ సింగ్ చడ్డా తన కెరీర్ లో గొప్ప మెమోరీ అన్నారు. అలానే తన చేతి మణికట్టు పై ఉన్న టాటూ ఏంటని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు గాను, అది సమంతతో తన పెళ్లి జరిగిన తేదీ తాలూకు పచ్చ బొట్టని, అయితే అది ఏంటో తెలియక కొందరు తన ఫ్యాన్స్ దానిని కాపీ కొట్టి చేతిపై వేయించుకోవడం చూశానన్నారు. అందుకే ఫ్యాన్స్ అందరికీ చేస్తున్న విన్నపం ఏమిటంటే, అది నా పెళ్లి తేదీ టాటూ, దయచేసి ఎవరూ దానిని ఫాలో కావొద్దు, టాటూ వేయించుకోవద్దని కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు