మారుతి సినిమాలో చైతు పాత్ర అదేనా ?

నాగ చైతన్య, మారుతి ల కాంబినేషన్ లో సినిమా ఇటివలే ప్రారంభం అయ్యింది. అను ఇమ్మానుల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. శైలజ రెడ్డి అల్లుడు అనే టైటిల్ ఈ సినిమాకోసం రిజిస్టర్ చేసారు.

తాజా సమాచారం మేరకు మారుతి ఈ సినిమాలో హీరోను ఇగో పాత్రలో చూపించబోతున్నాడు. గతంలో మారుతి తీసిన సినిమాలు పరిశిలిస్తే.. కొత్త జంట సినిమాలో హీరో స్వర్థపరుడి పాత్రలో కనిపిస్తాడు. అలాగే భలే భలే మగాడివోయ్ సినిమాలో మతిమరుపు, మహానుభావుడు సినిమాలో క్లీన్ నెస్ పాత్రల్లో దర్శనమిస్తారు. తన కొత్త సినిమాలో 1 మారుతి నాగ చైతన్య కోసం ఇగో పాత్రను క్రియేట్ చేసినట్లు సమాచారం.