“ఎఫ్ 3” సెట్స్‌లో నాగ‌ర‌త్త‌మ్మ‌ హంగామా మామూలుగా లేదుగా..!

Published on Mar 5, 2022 2:30 am IST


విక్టరీ వెంకటేశ్, మెహా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “ఎఫ్ 3”. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో “ఎఫ్ 2″కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయి.

అయితే ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రమోషన్స్‌ని మొదలుపెట్టింది చిత్ర బృందం. “ఎఫ్ 2” సినిమాకి విపరీతమైన అభిమాని అయిన రత్తమ్మ అనే క్యారెక్టర్‌తో వరుస ప్రమోషనల్ వీడియోలను విడుదల చేస్తున్నారు. తాజాగా “ఎఫ్ 3” సెట్స్‌లోకి అడుగుపెట్టిన రంగమ్మ హంగామా సృష్టించింది. ర‌త్త‌మ్మ ఎఫ్ 3 సెట్స్ లో సంద‌డి చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :