నాగశౌర్య, అనీష్ కృష్ణ ప్రాజెక్ట్‌పై రేపు అదిరిపోయే అప్డేట్..!

నాగశౌర్య, అనీష్ కృష్ణ ప్రాజెక్ట్‌పై రేపు అదిరిపోయే అప్డేట్..!

Published on Jan 22, 2022 2:08 AM IST


యంగ్ హీరో నాగశౌర్య, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనీష్‌ కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఓ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. షిర్లే సేతియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. అయితే రేపు నాగశౌర్య పుట్టిన రోజు కావడంతో ఈ చిత్రానికి సంబంధించి ఓ ఎగ్జైటింగ్ అప్డేట్‌ని ఇస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ అప్డేట్‌ని ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ అప్డేట్‌లో టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ని రివీల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్‌ నటి రాధిక, వెన్నెల కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు