పెళ్లితో ఒకటైన నాగశౌర్య, అనూషల యువ జంట.!

పెళ్లితో ఒకటైన నాగశౌర్య, అనూషల యువ జంట.!

Published on Nov 20, 2022 2:00 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ డేడికేటివ్ హీరో నాగ శౌర్య తన ఫిల్మ్ కెరీర్ లో “కృష్ణ వ్రిందా విహారి” తో మంచి క్లీన్ హిట్ ని అందుకోగా ఈ సినిమా హిట్ తోనే వెంటనే ఓ గుడ్ న్యూస్ ని కూడా తాను అనౌన్స్ చేసాడు. మరి తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసి తనకి కాబోయే భార్య అనూష ని తన ఫాలోవర్స్ కి మరియు టాలీవుడ్ కి పరిచయం చేసాడు.

ఇక ఇదిలా ఉండగా ఈరోజు అయితే నాగ శౌర్య మరియు అనూష శెట్టి ల యువ జంట బెంగళూరులో జ్ డబ్ల్యూ మారియోట్ లో కుటుంబ సభ్యులు మరియు ప్రముఖుల సమక్షంలో హ్యాపీ మూమెంట్స్ నడుమ సంప్రదాయబద్ధంగా ఈరోజు ఉదయం వివాహం చేసుకున్నారు. దీనితో ఇప్పుడు ఈ పెళ్లి విజువల్స్ బయటకి రాగా వారి ఫాలోవర్స్ మరియు మన టాలీవుడ్ ప్రముఖులు అయితే ఈ కొత్త జంటకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు