షూటింగ్ స్పాట్ లో కళ్ళు తిరిగి పడ్డ యంగ్ హీరో నాగ శౌర్య!

షూటింగ్ స్పాట్ లో కళ్ళు తిరిగి పడ్డ యంగ్ హీరో నాగ శౌర్య!

Published on Nov 14, 2022 4:56 PM IST

టాలీవుడ్ చరిత్రలో ఇదో బ్యాడ్ డేలా కనిపిస్తోంది. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ ఉదయం గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు, కొద్ది నిమిషాల క్రితం యంగ్ హీరో ఆసుపత్రిలో చేరారు. తాజా నివేదికల ప్రకారం, యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య షూటింగ్ స్పాట్‌లో కళ్ళు తిరిగి పడిపోయాడు.

ఈ పాత్ర కోసం తన బెస్ట్ ఇవ్వడానికి గత 3 రోజులుగా డైట్‌లో ఉన్నాడు ఈ హీరో. కళ్లు తిరిగి పడిపోవడం తో, వెంటనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. డీహైడ్రేషన్‌కు గురయ్యారని, ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. రేపు డిశ్చార్జి చేస్తారని వైద్యులు తెలిపారు. మరోవైపు, నాగశౌర్య ఈ ఆదివారం బెంగళూరులో అనూషా శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు