“లక్ష్య” ప్రీ రిలీజ్ వేడుక లో నాగ శౌర్య కీలక వ్యాఖ్యలు

Published on Dec 5, 2021 10:54 pm IST


నాగ శౌర్య హీరోగా, కేతిక శర్మ హీరోయిన్ గా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ల పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ను చిత్ర యూనిట్ నేడు నిర్వహించడం జరిగింది. ఈ వేడుక లో హీరో నాగ శౌర్య మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

2019 లో ఈ స్టోరీ సంతోష్ చెప్తే విన్నాను, విన్న వెంటనే ఓకే చెప్పా. నాలో నేను చూసుకున్నాను. ఈ సినిమా చేసేప్పుడు నేను ఎంతో నేర్చుకున్నాను. నిర్మాతలు ముగ్గురూ కూడా ఎంతో బాగా చూసుకున్నారు, థాంక్ యూ సర్, సంగీతం దర్శకుడు కాల భైరవ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. చాలా మంది అడిగారు. లక్ష్య లో రెండు సాంగ్సే ఉన్నాయి అని, అఖండ లో కూడా రెండే ఉన్నాయి, మా సినిమా లో కూడా రెండే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. కంటెంట్ ఉన్నప్పుడు ఎక్కువ సాంగ్స్ అవసరం లేదు అని మళ్ళీ ప్రూవ్ చేయడానికి వస్తుంది లక్ష్య. అదే విధంగా సంతోష్ గారు అనుకున్నది వచ్చే వరకు తీస్తూనే ఉన్నారు. చాలా బాగా తీశారు.మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అంటూ డైరక్టర్ సంతోష్ కి విషెస్ తెలిపారు. కెమెరా మెన్ చాలా బాగా చూపించారు. హ్యాట్సాఫ్ టు యువర్ డెడికేషన్ సర్. రొమాంటిక్ సినిమా చూశాక కేతిక శర్మ కి ఫిదా అయిపోయాను. అదే విధంగా టీమ్ అందరి ఎఫర్ట్స్ పై నాగ శౌర్య ప్రశంసల వర్షం కురిపించారు.

ట్రైనర్ ఆంటోనీ, కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష, మేకప్ మాన్ అందరూ ఎంతో కష్ట పడ్డారు. అందరికీ థాంక్స్. లవ్ స్టోరీ తో మాకు ఎంతో ఊపు ఇచ్చారు. వచ్చినందుకు చాలా థాంక్స్ సర్ అంటూ శేఖర్ కమ్ముల కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక శర్వానంద్ కి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :