టీజర్ తో ఆకట్టుకున్న “కృష్ణ వ్రింద విహారి” !

Published on Mar 28, 2022 10:05 am IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ఎప్పటికప్పుడు కొత్తదనంతో అలరించాలని కోరుకునే హీరో ‘నాగశౌర్య’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నాగ శౌర్య హీరోగా రాబోతున్న సినిమా “కృష్ణ వ్రింద విహారి”. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ‘కనిపించి వినిపించకుండా.. వినిపించి కనిపించకుండా..’ అంటూ మొదలైన ఈ టీజర్ రొమాంటిక్ టోన్ లో ఫీల్ గుడ్ లవ్ ఎమోషన్స్ తో చాలా బాగా ఆకట్టుకుంది. టీజర్ లో మెయిన్ మూవీ కాన్సెప్ట్ తో పాటు లవ్ సెటప్ ను అలాగే శౌర్య – షిర్లీ సేఠియా పాత్రలను, ఆ పాత్రల మధ్య లవ్ అండ్ ఎమోషన్ ను క్లారిటీగా బాగా ఎలివేట్ చేశారు.

ఇక నాగశౌర్య లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా చక్కగా కుదిరాయి. మొత్తానికి స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో కూడా నాగ శౌర్య మరియు షిర్లీ సేఠియా స్కూటర్ పై రైడ్‌ చేస్తూ బాగా కనిపించారు. వీరిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :