నాగ శౌర్య “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” టీజర్ కి డేట్ ఫిక్స్!

Published on Feb 6, 2023 4:30 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, నటి మాళవిక నాయర్ ఫలనా అబ్బాయి ఫలానా అమ్మాయి కోసం మరోసారి జతకట్టారు. టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ఏమిటంటే, ఈ చిత్రం యొక్క టీజర్‌ను ఫిబ్రవరి 9, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

అదే విషయాన్ని ప్రకటించడానికి ఒక చిన్న విడియో ను విడుదల చేయడం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ ప్రేమకథను నిర్మిస్తోంది. దీనికి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు విడుదల తేదీ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :