
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి..’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని తన కంటూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నాగ శౌర్య. ఇప్పటి వరకూ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో మాత్రమే కనిపించిన నాగ శౌర్య మొదటి సారిగా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా చేసిన సినిమా ‘జాదూగాడు’. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఆడియోకి మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగ శౌర్యని మాస్ లుక్ లో చూపిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంది.
షూటింగ్ తో పాటు దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోనున్న ఈ సినిమా కోసం ఈ చిత్ర టీం ఒక రిలీజ్ డేట్ ని ఫైనలైజ్ చేసారు. మాకు అందిన సమాచారం ప్రకారం జాదూగాడు టీం రిలీజ్ కోసం మే 29ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే ఇదే రిలీజ్ డేట్ ని ఫైనలైజ్ చేసి రిలీజ్ చేయనున్నారని సమాచారం. ‘చింతకాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనారిక బదోరియా కథానాయికగా నటించింది. సత్య ఎంటర్టైన్మెట్స్ పతాకంపై వి.వి.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.