ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నాగ శౌర్య కొత్త సినిమా!

Published on Mar 22, 2023 11:08 am IST


కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టితో ప్రామిసింగ్ యాక్టర్ నాగశౌర్య కొత్త సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. యుక్తి తరేజా ఈ చిత్రంలో కథానాయిక గా నటిస్తుంది. ముందుగా ప్రకటించినట్లుగా, మేకర్స్ చిన్న వీడియో గ్లింప్స్ తో పాటు సినిమా టైటిల్‌ను నేడు ప్రకటించారు. ఈ చిత్రానికి రంగబలి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ చాలా ఆసక్తికరం గా ఉంది.

కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం అందించనున్నారు. దివాకర్ మణి కెమెరా క్రాంక్ చేయనున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :