స్ట్రీమింగ్ కి వచ్చేసిన నాగ శౌర్య ఆ రెండు చిత్రాలు!

Published on Jan 7, 2022 11:08 am IST

నాగ శౌర్య హీరోగా నటించిన వరుడు కావలెను మరియు లక్ష్య చిత్రాలు నేడు ఓటిటి ద్వారా స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. వరుడు కావలెను చిత్రం నేటి నుండి జీ 5 లో ప్రసారం కానుంది. రీతూ వర్మ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, లక్ష్మీ సౌజన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిర్మించడం జరిగింది.

అదే విధంగా నాగ శౌర్య నటించిన లక్ష్య చిత్రం నేటి నుండి ఆహా వీడియో లో ప్రసారం కానుంది. కేతిక శర్మ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, సచిన్ ఖేదేఖర్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించడం జరిగింది. ఈ రెండు చిత్రాలు నేటి నుండి ఆన్లైన్ వేదిక గా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :