లేటెస్ట్ : ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లుక్స్ లో అదరగొట్టిన నాగశౌర్య, అనుష్క శెట్టి

లేటెస్ట్ : ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లుక్స్ లో అదరగొట్టిన నాగశౌర్య, అనుష్క శెట్టి

Published on Nov 20, 2022 3:04 AM IST


యువ నటుడు నాగశౌర్య తాజాగా కృష్ణ వ్రిందా విహారి మూవీ తో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వరుసగా సినిమాలు ఎంచుకుంటూ ఆడియన్స్ నుండి మంచి పేరుతో కొనసాగుతున్న నాగ శౌర్య, కర్ణాటక కుందాపూర్ కి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని నేడు వివాహం చేసుకోనున్నారు. ఇక ఈ జంట నిన్నటి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అదరగొట్టారు.

బెంగళూరు జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో వీరి వివాహం ఎంతో వైభవంగా జరుగనుండగా నిన్నటి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి శౌర్య, అనూష ఇద్దరూ కూడా లేటెస్ట్ ట్రెండీ స్టైల్ దుస్తులతో అదరగొట్టారు. వీరిద్దరి ఆ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేసారు. కాగా నేడు గ్రాండ్ లెవెల్లో జరుగనున్న వీరి వివాహ వేడుకకి భారీ స్థాయిలో టాలీవుడ్ లో పాటు ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సెలెబ్రిటీస్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు