ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాగ శౌర్య !

యంగ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం ‘ఛలో’. అన్ని పనులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ ఆడియన్సుకి బాగా కనెక్టయ్యాయి. ఈ కనెక్టివిటీని ఇంకాస్త పెంచేలా హీరో నాగ శౌర్య ప్రమోషన్లు చేస్తున్నారు.

లవ్ స్టోరీ కనుక ముఖ్యంగా యువతకు దగ్గరయ్యేందుకు కాలేజీలకు వెళ్లి మరీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, ఏలూరు, భీమవరం వంటి ప్రాంతాల్లోని కాలేజీలను సందర్శించి, విద్యార్థులను కలిసిన ఆయన ఇంకొన్ని కళాశాలలకు కూడా వెళ్లనున్నారు. నూతన దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా పరిచయం కానుంది. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేయనున్నారు.