ముగ్గురు కొత్త దర్శకులతో యువహీరో సినిమాలు !
Published on Nov 2, 2017 12:14 pm IST

యువ కథానాయకుడు నాగ శౌర్య ప్రస్తుతం ‘చలో’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమాతో పాటు విజయ్ దర్శకత్వంలో ‘కణం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగ శౌర్య. కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చడంతో ఆ ప్రాజక్టును ఒప్పుకున్నాడు. దీనికి ‘నర్తనశాల’ అనే టైటిల్ నిర్ణయించారు.

సుందర్ దర్శకత్వంలో ‘అమ్మమ్మగారి ఇల్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు నాగ శౌర్య. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘సుప్రీమ్’ ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలకు సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. ముగ్గురు కొత్త దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు నాగ శౌర్య.

 
Like us on Facebook