‘కృష్ణ వ్రింద విహారి’ పాజిటివ్ రెస్పాన్స్ తో నాగశౌర్య ఎమోషనల్

Published on Sep 23, 2022 11:00 pm IST

టాలీవుడ్ యువ నటుల్లో ప్రస్తుతం మంచి సక్సెస్ఫుల్ సినిమాలతో కొనసాగుతున్న నటుడు నాగశౌర్య. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి. షిర్లే సెటియా హీరోయిన్ గా నటించిన ఈ మూవీని యువ దర్శకుడు అనీష్ కృష్ణ తెరకెక్కించగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూల్పూరి ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. వెన్నెల కిషోర్, రాధికా శరత్ కుమార్, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక రోల్స్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ నేడు మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది.

ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా బాగా కలెక్షన్స్ తో కొనసాగుతుండడంతో కొద్దిసేపటి క్రితం తన తల్లి, మరియు ఈ మూవీ నిర్మాత అయిన ఉష మూల్పూరి గారిని హగ్ చేసుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారు నాగశౌర్య. తమ టీమ్ మొత్తం స్క్రిప్ట్ మీద ఎంతో నమ్మకంతో చేసిన ఈ మూవీకి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందంగా ఉందని, మంచి కంటెంట్ తో మూవీ చేస్తే తమ ఆదరణ ఎప్పుడూ ఉంటుందని మన తెలుగు ప్రేక్షకులు మరొకసారి నిరూపించారని యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :