నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published on May 3, 2023 9:06 pm IST


యువ నటుడు నాగశౌర్య హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఫ్యామిలీ యాక్షన్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థల పై టిజి విశ్వప్రసాద్, పద్మజ దాసరి గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి పర్వాలేదనిపించే విజయాన్ని అందుకుంది.

కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ మూవీకి సునీల్ కుమార్ నామ ఫోటోగ్రఫి అందించారు. విషయం ఏమిటంటే, ఈ మూవీని ప్రముఖ ఓటిటి మాధ్యమం సన్ నెక్స్ట్ వారు మే 5 నుండి తమ ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఈ విషయమై వారి నుండి కొద్దిసేపటి క్రితం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మరి ఈమూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :