నాగ శౌర్య సినిమా వాయిదా ?

నాగ శౌర్య కొంత గ్యాప్ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో ‘కణం’ సినిమా చేస్తోన్న ఈ హీరో వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘చలో’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 28 న విడుదల చెయ్యబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

తాజా సమాచారం మేరకు చలో మూవీని ఫిబ్రవరి మెదటి వారంలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. వరుస సినిమాలు విడుదల కావడం తోనే ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. శౌర్య సొంత బ్యానర్ ‘ఐరా క్రియేషన్స్’ పై ఉషా మూల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.