అల్లు అర్జున్, పుష్ప టీమ్ పై “భీమ్లా నాయక్” నిర్మాత కీలక వ్యాఖ్యలు!

Published on Dec 7, 2021 7:43 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ను చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా భీమ్లా నాయక్ చిత్ర నిర్మాత అయిన సూర్య దేవర నాగ వంశీ ట్రైలర్ ను చూసి స్పందించారు. ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చింది, నాకు గొడ్డలి ఇచ్చింది, ఎవడి యుద్ధం వాడిదే అంటూ డైలాగ్ ను చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ట్రాన్స్ఫార్మేశన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సుకుమార్ గారికి, మైత్రి మూవీ మేకర్స్ కి మరియు పుష్ప టీమ్ కి సూర్య దేవర నాగ వంశీ విషెస్ తెలిపారు. ఈ మేరకు పుష్ప చిత్ర యూనిట్ స్పందిస్తూ, భీమ్లా నాయక్ చిత్రానికి కూడా బెస్ట్ విషెస్ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :