నిర్మాత నాగవంశీ సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలపై ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ‘సంక్రాంతికి పోటీ ఉండదు’ అని చేసిన కామెంట్స్ పై తాజాగా నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తన కామెంట్స్ ను కొందరు తప్పుదోవ పట్టించారని నాగవంశీ అసహనం వ్యక్తం చేశారు. ఇంతకీ, నాగవంశీ ఏం మాట్లాడారు అంటే..‘సంక్రాంతికి ఆరు సినిమాలు వస్తాయి కదా.. పోటీ ఎక్కువగా ఉంటుందా..? అని అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. ఈసారి అన్ని సినిమాలు రావు. వచ్చినా.. పెద్దగా కాంపిటీషన్ ఉండదు అని చెప్పాను.
అయితే, ఆ కామెంట్‌ను కొందరు సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించారు. ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి వస్తుందని.. ఆ సినిమా మాకు పోటీ కాదని చెప్పినట్లు మిస్ లీడ్ చేశారు. ఇందులో ఏమైనా అర్థముందా ?. ఈసారి సంక్రాంతికి ఆరు సినిమాలు రావు.. మూడు వస్తాయి. ఇలా విడుదలవడం ఇండస్ట్రీలో సహజమే. నేను ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ను సోషల్ మీడియాలో వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు. ఒక ప్రొడ్యూసర్‌గా నేను మరొకరి సినిమా హిట్ కాకూడదని ఎందుకు అంటాను ?, ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేరు’’ అని నాగవంశీ చెప్పుకొచ్చారు.