అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో, ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు, అక్కినేని అభిమానులకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.
అఖిల్ అక్కినేని రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం ఈ సినిమా. మీ ‘సిసింద్రీ’ మరో 12 గంటల్లో మీ ముందుకు రాబోతున్నాడు. ల్యాంగ్ గ్యాప్ తర్వాత ఒక భారీ బ్రేక్‌థ్రూ కోసం ఆయన ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ డ్రామాపై తన రక్తాన్ని, చెమటను, ఆత్మను ధారపోశాడు. మీరందరూ థియేటర్లకు వచ్చి, మీ ప్రేమాశీస్సులతో అఖిల్‌ను ఆశీర్వదించి, సినిమాకు భారీ ఓపెనింగ్స్ అందించాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నామంటూ నాగవంశీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘ఈసారి అఖిల్ మీ ముందుకు ఒక గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన అబ్బాయిలా రావడం లేదు. తన ప్రతిభను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్న ఒక కొత్త నటుడిలా మీ ముందుకు వస్తున్నాడు. ఇది సరికొత్త ‘అఖిల్ 2.0’. థియేటర్ల నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక కంప్లీట్ సినిమాను చూశామనే పూర్తి సంతృప్తితో మీరు వస్తారని మా చిత్రబృందం తరఫున ప్రామిస్ చేస్తున్నాను’ అంటూ నాగవంశీ పోస్ట్ చేశారు.
Two years of @AkhilAkkineni8’s hard work, your own Sisindri is finally coming to you in less than 12 hours.
He has poured his blood, sweat, and soul into this high octane action drama, treating it as another big breakthrough after a long gap.
We sincerely request all of you to…
— Naga Vamsi (@vamsi84) July 9, 2026
