నా నోటి నుండి వచ్చే ప్రశ్నలను ఆర్జీవీ బయటపెట్టారు – నాగబాబు

Published on Jan 4, 2022 6:48 pm IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో టికెట్ ధరల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. సోషల్ మీడియా వేదిక గా ప్రముఖ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కి పది ప్రశ్నలను సంధించారు. ఈ మేరకు అందుకు సంబంధించిన ఒక వీడియో ను సైతం యూ ట్యూబ్ లో షేర్ చెయ్యడం జరిగింది.

రామ్ గోపాల్ వర్మ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కి సంధించిన ప్రశ్నల విషయం లో మెగా సోదరుడు అయిన నాగబాబు సోషల్ మీడియా వేదిక గా స్పందించారు. ఆర్జీవీ చెప్పింది పూర్తి గా నిజమే అని, తన నోటిలో నుండి వచ్చే ప్రశ్నలను ఆర్జీవీ బయటపెట్టారు అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. నాగబాబు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :