“ఆరెంజ్” రెస్పాన్స్ పై నాగబాబు రియాక్షన్.!

Published on Mar 30, 2023 9:00 am IST

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్స్ లో ఓ సినిమా రీ రిలీజ్ అనేది మంచి ఆశ్చర్యకరంగా ఊహించని విధంగా మారింది అంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “ఆరెంజ్” సినిమా రీ రిలీజ్ అనే చెప్పి తీరాలి. దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ప్లాప్ అయ్యిన ఈ చిత్రం తర్వాత అయితే ఒక సెన్సేషనల్ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.

మరి ఇప్పుడు అయితే రీ రిలీజ్ లో ఊహించని రేంజ్ హిట్ అయ్యిన ఈ సినిమా పై నిర్మాత నాగబాబు అయితే తన రెస్పాన్స్ ని వ్యక్తం చేశారు. ఆరెంజ్ రీ రిలీజ్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇచ్చిన ఆడియెన్స్ కి స్పెషల్ థాంక్స్ చెప్తున్నానని అలాగే ఈ రీ రిలీజ్ లో సహకరించిన నిర్మాత అల్లు అరవింద్ మరియు బన్నీ వాసులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. అంతే కాకుండా సాయి రాజేష్, ధర్మేంద్ర మరియు ఎస్ కె ఎన్ లకు కూడా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని నాగబాబు అయితే ఆరెంజ్ రీ రిలీజ్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :