మా లో కొనసాగడం ఇష్టం లేక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న నాగబాబు!

Published on Oct 11, 2021 12:00 am IST

తెలుగు సినిమా పరిశ్రమ లో ఆర్టిస్టుల కోసం జరిగిన మా ఎన్నికల్లో హీరో మంచు విష్ణు ప్రెసిడెంట్ గా పోటీ చేసి దాదాపు 100 ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించారు. కాగా ఈ ఎన్నికల సమయం లో ఒకరు పై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. కాగా, ప్రస్తుతం టాలీవుడ్ నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు షాకింగ్ డెసిషన్ తీసుకోవడం జరిగింది.

ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు అంటూ నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన రాజీనామా ను మా అసోసియేషన్ కి 48 గంటల్లో తన స్టాఫ్ ద్వారా పంపుతాను అని తెలిపారు. ఇది ఎంతో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా పూర్తి చిత్తశుద్ది తో తీసుకున్న నిర్ణయం అని అన్నారు. నాగబాబు తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :