నాగబాబు ట్వీట్..ఇకపై ఆ ట్రోల్స్ ఆపెయ్యండి.!

Published on Jul 20, 2022 7:00 pm IST

గత రెండు రోజులు నుంచి కూడా మెగా ఫ్యాన్స్ కి ఆరాధ్య దైవం అయినటువంటి మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ రాజకీయ నేత సిపిఐ నారాయణ చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే దీనితో తీవ్ర ఆగ్రహానికి లోనైన మెగా ఫ్యాన్స్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చెయ్యగా నారాయణ మళ్ళీ ప్రెస్ మీట్ ముందు తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నానని పొరపాటు అయ్యిందని తెలిపారు.

అయితే మరి దానికి ముందే మెగా బ్రదర్ నాగబాబు చిరుపై నారాయణ చేసిన వ్యాఖ్యలకు గాను గట్టి కౌంటర్ ఇవ్వగా ఇప్పుడు సిపిఐ నారాయణ క్షమాపణ చెప్పాక మెగా ఫ్యాన్స్ కి ట్వీట్ ద్వారా ఇక అందరూ అన్ని ఆపేయాలని సూచించారు. “తప్పు ఎవరు చేసినా సరే.. ఒకసారి క్షమాపణలు కోరితే క్షమించండి మన మెగా జనసైనికుల ధర్మం. కాబట్టి సీపీఐ నారాయణ పెద్ద వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని మన మెగా జనసైనికులందరినీ కోరుతున్నాను.” అని తెలిపారు. మరి మెగా ఫ్యాన్స్ ఈ మాట మేరకు ఆపేస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :