నాగచైతన్య ‘కస్టడీ’ మ్యూజిక్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

Published on Dec 8, 2022 7:02 pm IST

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ కస్టడీ. చైతన్య కెరీర్ 22వ మూవీగా రూపొందుతోన్న కస్టడీ మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మిస్తుండగా మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ అయి ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. అయితే విషయం ఏమిటంటే, కస్టడీ ఆడియో రైట్స్ ని ప్రముఖ సంస్థ జంగ్లీ మ్యూజిక్ వారు దక్కించుకున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అతి త్వరలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబందించిన మిగతా అప్ డేట్స్ అతి త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం :