“కస్టడీ” విషయంలో చై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on May 6, 2023 4:00 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం “కస్టడీ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కడమే కాకుండా లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో అయితే మరిన్ని అంచనాలు ఇపుడు ఈ సినిమాపై నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో అయితే మేకర్స్ తెలుగు సహా తమిళ్ లో ఫీల్ బిజీగా ఉండగా ఈ సినిమా విషయంలో చైతూ ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడో తెలిపాడు.

తన చిత్రాల్లో కొన్ని అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గరే వాటి రిజల్ట్ అర్ధం అయ్యిపోతుంది అని కానీ కస్టడీ విషయంలో మాత్రం చాలా నమ్మకం కలిగింది అని తాను తెలిపాడు. దీనితో కస్టడీ తో మాత్రం తాను స్యూర్ షాట్ హిట్ కొట్టబోతున్నట్టుగా చెప్పకనే చెప్పాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో అరవింద స్వామి విలన్ గా నటించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అయితే ఈ మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :