నాగచైతన్య చేతుల మీదుగా “లక్ష్య” మూవీ సాంగ్ రిలీజ్..!

Published on Dec 5, 2021 2:25 am IST


యంగ్ హీరో నాగ శౌర్య, కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా ధీరేంద్ర సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్ష్య’. ఆర్చరీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జగపతి బాబు, సచిన్ ఖేదేఖర్‌లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి “సాయ సాయ” అనే ఫుల్ లిరికల్ సాంగ్‌ను అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కాగా ఈ పాటకు క్రిష్ణ కాంత్ లిరిక్స్ అందించగా, జునైద్ కుమార్ ఆలపించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :