నాగచైతన్య ‘థాంక్యూ’ ఓటిటి లోకి వచ్చేది అప్పుడేనా … ?

నాగచైతన్య ‘థాంక్యూ’ ఓటిటి లోకి వచ్చేది అప్పుడేనా … ?

Published on Aug 3, 2022 1:00 AM IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా మాళవిక నాయర్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ థాంక్యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ ఎమోషనల్ లవ్ లైఫ్ జర్నీ స్టోరీ మూవీని విక్రమ్ కె కుమార్ తెరకెక్కించగా థమన్ మ్యూజిక్ అందించారు. అయితే మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల విడుదల తరువాత ఆశించిన స్థాయి సక్సెస్ ని అయితే అందుకోలేకపోయింది.

ఈ మూవీలో నాగ చైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించగా మరొక ముఖ్య పాత్రలో అవికా గోర్ నటించింది. ఇక ఈ మూవీ ఆగష్టు 12న ప్రముఖ ఒటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. మరి థియేటర్స్ లో పెద్దగా సక్సెస్ కాని థాంక్యూ మూవీ, ఓటిటిలో ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు