‘నిర్మలా కాన్వెంట్’ జస్ట్ లవ్ స్టోరీ మాత్రమే కాదు : నాగార్జున

5th, September 2016 - 06:09:18 PM

nagarjuna
అన్నపూర్ణ స్థూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్ బ్యానర్స్ పై హీరో నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిరం ‘నిర్మలా కాన్వెంట్’. జి. నాగా కోటేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ ‘ఈ కథ వినగానే ఫ్రెష్, ప్యూర్ లవ్ స్టోరీలా అనిపించింది. ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీలు వచ్చి చాలా రోజులైంది. ఇది అలాంటి కథే’ అన్నారు.

అలాగే ‘ప్రేమ దేన్నైనా గెలుస్తుంది అనేదే ఇందులో మెసేజ్. మంచి స్క్రిప్ట్ నటులను వెతుక్కుంటూ వెళుతుంది. అందుకే రోషన్ ఈ సినిమాలో ఉన్నాడు. హీరోయిన్ కూడా బాగా చేసింది. వాళ్ళ జంట చాలా బాగుంటుంది. ఇందులో నాది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓ రిచ్ బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తాను. ఫస్ట్ టైమ్ హీరో ఒకళ్ళు, అన్నీ నేను అనే పాత్ర చేశాను. ఇంటర్వెల్ తరువాత నుంచి క్లైమాక్స్ వరకూ ఉంటాను. రోషన్ అయితే ఇతనిది మొదటి సినిమానా అన్నట్టు చేశాడు’ అన్నారు. ఇకపోతే ఈ సినిమా ఆడియోను సెప్టెంబర్ 8న విడుదల చేసి చిత్రాన్ని 16న రిలీజ్ చేయనున్నారు.