‘యుద్ధం శరణం’ సినిమా కథేమిటో చెప్పిన నాగార్జున !

28th, August 2017 - 11:52:19 AM


నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘యుద్ధం శరణం’ సెప్టెంబర్ 8న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి మంచి మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం నిన్న ఆడియో రిలీజ్ సందర్బంగా విడుదలైన ట్రైలర్స్ తో మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. దీంతో అందరిలోనూ సినిమా ఎలా ఉండేటోబోతోందో అనే క్యూరియేసిటీ ఎక్కువైపోయింది. తాజాగా ఈ చిత్రం గురించి మాట్లాడిన నాగార్జున సినిమా కథ ఎలా ఉంటుందో చిన్న హింట్ ఇచ్చారు.

ఈరోజుల్లో బాగా బలమైన సోషల్ మీడియా మాధ్యమాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశాన్ని ఇందులో చూపాం. ఇది మైండ్ గేమ్ తో నడిచే సినిమా. డిఫరెంట్ జానర్. సినిమాను కొద్ది కొద్దిగా చూశాను. చాలా బాగా వచ్చింది. సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు. తమిళ దర్శకుడు కృష్ణ ఆర్వి మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా సీనియర్ నటుడు శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నాడు.