“బంగార్రాజు” పై అదిరే అప్డేట్స్ ఇచ్చిన నాగ్.!

Published on Nov 20, 2021 11:00 am IST

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చేస్తున్న చిత్రం “బంగార్రాజు” కూడా ఒకటి. తన హిట్ సినిమా “సోగ్గాడే చిన్నాయన” కి సీక్వెల్ లా కాదు కానీ ఆ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్రాంచైజ్ లా చేస్తున్న సినిమా ఇది.

మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తుండగా.. ఇప్పుడు ఎట్టకేలకు ఓ అదిరే అప్డేట్ ని అందిస్తున్నట్టుగా కింగ్ నాగ్ రివీల్ చేశారు. అదేమిటంటే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యబోతున్నారట.

వచ్చే నవంబర్ 22న సాయంత్రం 5 గంటల 22 నిమిషాలకు “బంగార్రాజు” ఫస్ట్ లుక్ తో పలకరించనున్నాడట. అలాగే టీజర్ నవంబర్ 23న ఉదయం 10 గంటల 23 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అదిరే అప్డేట్స్ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :