మలయాళ రీమేక్‌పై ఇంట్రెస్ట్ చూపుతున్న నాగార్జున..!

Published on Oct 20, 2021 12:19 am IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీమేక్‌ల జోరు కొనసాగుతుందని చెప్పాలి. తమిళ్, మలయాళ భాషల్లో మంచి హిట్ టాక్ అందుకున్న సినిమాలను ఈ మధ్యన మన దగ్గర బాగా రీమేక్ చేస్తున్నారు. మెగస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ‘గాడ్ ఫాదర్’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, వెంకటేశ్ ‘దృశ్యం 2’ సినిమాలన్ని మలయాళ రీమేక్‌లే కావడం విశేషం.

అయితే తాజాగా కింగ్ నాగార్జున కూడా ఓ మలయాళ సినిమా రీమేక్‌పై ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న మలయాళ మూవీ ‘ది గ్రేట్ ఇండియన్ కిచన్’. జియో బేబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిమిషా-సూరజ్ ప్రధానమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో కథానాయికకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో నాగ్ నటిస్తాడో లేక నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారో అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ రీమేక్‌పై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :