కింగ్ అక్కినేని నాగార్జున తాజా మాస్ యాక్షన్ సినిమా నా సామిరంగ. నృత్య దర్శకుడు విజయ్ బన్నీ తొలిసారిగా మెగాఫోన్ పడుతూ టాలీవుడ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మాస్ యాక్షన్ తో కూడిన రస్టిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీలో పలాస, శ్రీదేవి సోడా సెంటర్ దర్శకుడు కరుణ కుమార్ నెగటివ్ పాత్ర చేస్తున్నారు.
అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, ఈ మూవీలో నాగార్జున కి జోడీగా ఆషికా రంగనాథ్, అలానే మానస వర్షిణి ల పేర్లని టీమ్ పరిశీలించిన టీమ్ వారిద్దరికీ తాజాగా లుక్ టెస్ట్ చేసారని, త్వరలో ఇద్దరిలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల టాక్. కాగా ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.