బిగ్‌బాస్ సీజన్ 5కి నాగ్ మరీ అంత తీసుకున్నాడా?

Published on Sep 7, 2021 2:00 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’కు ఉన్న క్రేజ్ గురుంచి పెద్దగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఈ రియాలిటీ షో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా, నిన్న ఐదో సీజన్ కూడా అత్యంత గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. బిగ్‌బాస్‌ మూడు, నాలుగు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అక్కినేని నాగార్జునే ఐదో సీజన్‌కు కూడా హోస్టింగ్‌ చేస్తున్నాడు.

అయితే ఈ సీజన్‌కి హోస్ట్‌గా చేసేందుకు నాగార్జున తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు తీసుకున్న నాగ్ ఈ సారి ఎవరూ ఊహించని మొత్తాన్ని తీసుకుంటున్నాడట. 106 రోజుల పాటు కొనసాగనున్న ఈ సీజన్‌కు రూ.12 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ వంటి రియాలిటీ షోను రసవత్తరంగా నడిపించడంలో హోస్ట్‌ది కీలకపాత్ర కావడం, నాగ్ హోస్టింగ్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వడంతోనే అంత భారీ మొత్తం ఇవ్వడానికి కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు వెనకాడలేదని ప్రచారం నడుస్తుంది.

సంబంధిత సమాచారం :