నాగార్జున, వర్మ సినిమా షూటింగ్ వివరాలు !

8th, January 2018 - 03:46:13 PM

నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌలిలో జరుగుతోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన నాగార్జున లుక్ కు మంచి స్పందన లభించింది.

ఈ సినిమా కోసం నాగార్జున సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడు మైరా సరీన్‌ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మోడలింగ్ లో ఉన్న ఈ అమ్మాయి నాగార్జున సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని నాగార్జున, వర్మ తెలియజేయడం విశేషం.