దుబాయ్ షూట్ లో బిజీగా నాగ్ క్రేజీ థ్రిల్లర్.!

Published on Mar 10, 2022 9:00 am IST

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “బంగార్రాజు” తన కెరీర్ లోనే మరో బెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమా లైన్ లో ఉండగానే నాగ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు తో అనౌన్స్ చేసిన క్రేజీ థ్రిల్లర్ సినిమానే “ఘోస్ట్”. ఫస్ట్ లుక్ తోనే హాలీవుడ్ రేంజ్ ఫీల్ ఇచ్చిన ఈ సినిమా ఆసక్తికర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.

మరి ఆల్రెడీ చాలా మేర షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు దుబాయ్ లో షూటింగ్ ని జరుపుకుంటుందట. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఆన్ లొకేషన్ స్టిల్స్ కూడా బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా నాగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :