బొమ్మ‌ల‌తో టెన్షన్ పెడుతున్న బిగ్ బాస్ !

బొమ్మ‌ల‌తో టెన్షన్ పెడుతున్న బిగ్ బాస్ !

Published on Oct 17, 2021 8:07 PM IST

బిగ్ బాస్ అభిమానులు దగ్గర నుంచి హౌస్ సభ్యుల వరకూ సండే వ‌చ్చిందంటే ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఇక నామినేష‌న్స్‌లో ఉన్న‌ సభ్యులు అయితే ఎలిమినేష‌న్ అయిపోతామేమో అనే టెన్ష‌న్‌ తో తప్పులు మీద తప్పులు చేస్తారు. కాగా తాజాగా నామినేష‌న్స్‌ లో పది మంది ఉంటే.. అందులో లోబో ఇప్ప‌టికే సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు కాబట్టి.. ఇక మిగిలిన 9 మందిలో నాగార్జున ఎవ‌రినీ సేవ్ చేయ‌లేదు.

మరి ఆ 9 మంది భ‌విష్య‌త్తును నిర్ణ‌యించేందుకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. నామినేష‌న్స్‌లో ఉన్న‌ అందరికీ టెడ్డీబేర్స్ ఇచ్చారు. వాటిలో ఎవ‌రి ఫొటో ఉంటుందో వాళ్లు ఎలిమినేట్ అవుతారు. దాంతో కంటెస్టెంట్లు అందరూ ఊపిరి బిగ‌ప‌ట్టుకుని ఆ బొమ్మ‌ల‌ను ఓపెన్ చేసి చూస్తున్నారు. మొత్తానికి ఈ వారం ఎపిసోడ్ బాగానే ఆకట్టుకుంది. బిగ్ బాస్ బొమ్మ‌ల‌తోనే టెన్షన్ పెడుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు