బిగ్ బాస్ 5: అక్కినేని నాగార్జున సంచలన నిర్ణయం!

Published on Dec 13, 2021 11:00 am IST

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ వేదిక పై అక్కినేని నాగార్జున మరొక సెన్సేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాజాగా జరిగిన ఎపిసొడ్ లో అక్కినేని నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ను ఆహ్వానించడం జరిగింది.

అయితే ఎంపీ సంతోష్ కుమార్ తో జరిగిన సంభాషణ లో అక్కినేని నాగార్జున 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని దత్తత తీసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా వచ్చే మూడు వారాల్లో మూడు మొక్కలను నాటాలని, కంటెస్తెంట్స్, తన అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా నాటాలి అంటూ కోరారు. సంతోష్ కుమార్ ఇచ్చిన మొక్కను బిగ్ బాస్ హౌజ్ లో నాగార్జున నాటారు. పర్యావరణ పరిరక్షణ పై సంతోష్ కుమార్ స్ఫూర్తి ను కొనసాగిస్తా అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :