వైరల్ వీడియో : ఫ్యాన్స్, ఆడియన్స్ కి నాగ్ స్పెషల్ థాంక్స్

Published on Aug 30, 2022 1:10 am IST

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నేడు తన 63వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దానితో పలువురు ఆయన ఫ్యాన్స్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అలానే పలువురు సినిమా ప్రముఖులుసైతం నాగ్ కి స్పెషల్ గా సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు.

కాగా నేడు తన ఫ్యాన్స్ తో పాటు, పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు అందరూ తనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉండడం ఎంతో ఆనందంగా ఉందని, చాలామంది నేడు ఉదయం నుండి తనకు ఫోన్ ద్వారా కూడా విషెస్ తెల్పుతున్నారని, ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞలు తెలియచేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ఒక వీడీయో బైట్ ద్వారా తెలిపారు నాగార్జున. అలానే ప్రస్తుతం బిగ్ బాస్ 6 తో పాటు ది ఘోస్ట్, బ్రహ్మాస్త్ర మూవీస్ తో త్వరలో మీ అందరి ముందుకు రాబోతున్నాను, తప్పకుండా అవి మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు నాగార్జున.

ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ కి అందరి నుండి మంచి స్పందన లభిస్తుండడం ఆనందంగా ఉందని, తప్పకుండా మూవీ కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని ఆయన అన్నారు. కాగా నాగార్జున పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :