నటులం వస్తుంటాం, పోతుంటాం.. కానీ సాహిత్యం శాశ్వతమైంది – నాగార్జున

Published on Jan 10, 2022 11:00 am IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ పై మంచి అంచనాలు ఉన్నాయి. చైతు – నాగ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఆదివారం ‘బంగార్రాజు’ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ‘చిత్ర బృందానికి థ్యాంక్స్‌ ఇప్పుడు కాదు సక్సెస్‌ మీట్‌లో చెప్పాలనుంది. ఎందుకంటే.. ఈ సినిమా విషయంలో అంత నమ్మకంతో ఉన్నాను.

ఇక ఈ సినిమా విజయంలో సగభాగం సంగీతానిదే. సంగీత దర్శకుడు అనూప్‌కి ఆ విజయాన్ని ఇచ్చేశాం. పాటల రచయితలు మంచి సాహిత్యం అందించారు. నటులం వస్తుంటాం, పోతుంటాం కానీ సాహిత్యం శాశ్వతమైంది. మీరు ఎంత ఊహిస్తున్నారో అంతకు మించి ఉంటుంది ఈ సినిమా. జనవరి 11న ట్రైలర్‌ విడుదలకానుంది’’ అని నాగార్జున తెలిపారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :