‘బంగార్రాజు’ను అందరూ ఆదరించండి – నాగార్జున

‘బంగార్రాజు’ను అందరూ ఆదరించండి – నాగార్జున

Published on Jan 10, 2022 8:00 AM IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ పై మంచి అంచనాలు ఉన్నాయి. చైతు – నాగ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఆదివారం ‘బంగార్రాజు’ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘అభిమానులందరినీ ఇక్కడకు పిలవాలని, పిలవలేకపోయాం. అందరూ క్షమించండి. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోకు ఇది చాలా ముఖ్యమైన తేదీ. అదే రోజున అన్నపూర్ణ పుట్టింది.

దసరా బుల్లోడు అనే సినిమాతో యాభై ఏళ్ల క్రితం నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారు. అది కూడా మ్యూజికల్ హిట్. సక్సెస్ మీట్‌లో అందరికీ థ్యాంక్స్ చెబుతాను. సినిమాకు సగం సక్సెస్ మ్యూజిక్. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. చక్కటి మాస్ కమర్షియల్ సాంగ్స్ ఇచ్చారు. ప్రతీ సాంగ్ ఓ వజ్రంలా ఉంటుంది. సూపర్ హిట్ ఆల్బమ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. అందరూ ఆదరించండి’’ అని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు