పవర్ ఫుల్ డైలాగ్ తో సినిమాను మొదలుపెట్టిన నాగార్జున !
Published on Nov 20, 2017 4:10 pm IST

18 ఏళ్ల తరువాత నాగార్జున & వర్మ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయ్యింది. అన్నపూర్ణ స్టుడియోలోని గ్లాస్ హౌస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైన్ సెట్‌లో నాగార్జునపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. రామ్ గోపాల్ వర్మ తల్లి తొలిషాట్ కు క్లాప్ కొట్టడం జరిగింది. నాగార్జున మొదటి సన్నివేశంలోనే ‘నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నేను నిన్ను చంపటం గ్యారంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావ్ తక్కువ నొప్పితో చస్తావా ఎక్కువ నొప్పితో చస్తావా.. చూజ్’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి సినిమాను ప్రారంభించారు.

ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ ఓపెనింగ్ చూడ్డానికి భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ’28 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుందని నాన్న అనేవారు, నాకు 28 ఏళ్ళకు శివ సినిమా చేశాను. మళ్ళీ ఇప్పుడు 28 ఏళ్ళ తర్వాత డబుల్ మెచ్యురిటీతో వర్మతో కలిసి మళ్ళీ సినిమా చేస్తున్నాను’ అన్నారు.

 
Like us on Facebook