తానెరికీ డబ్బులు ఎగ్గొట్టలేదన్న నాగార్జున !

17th, November 2016 - 03:50:07 PM

Nagarjuna
పరిశ్రమలోని సీనియర్ నటుల్లో ఒకరు నాగార్జున ఈరోజు తనపై వస్తున్న రకరకాల రూమర్లకు చెక్ పెడుతూ ట్విట్టర్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చారు. మోదీ కరెన్సీ బ్యాన్ ప్రకటించగానే నాగరాజును ఆయన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. అప్పటి నుండి కొంతమంది సోషల్ మీడియాలో నాగార్జున పై గతంలో ఒక బ్యాంకు ఆరోపించిన ఒక ఆరోపణను ఆధారంగా చేసుకుని కించపరిచే విధంగా రకరకాల స్టేట్మెంట్లు, కామెంట్లు చేశారు. వాటన్నింటినీ గమనించిన నాగ్ ఈరోజు గట్టి సమాధానమిచ్చారు.

ట్విట్టర్ ద్వారా ఆయన తెలుపుతూ ‘నేను లేదా అన్నపూర్ణా స్టూడియోస్ కొంతమందికి, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టామని అనుకుంటున్నా కొంతమందికి నెను చెప్పేది ఏమిటంటే నేను ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టలేదు. గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా రంగానికి సంబందించిన కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నేను బ్యాంకు నుండి రానా తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఈ సంవత్సరం మొదట్లోనే ఆ రుణాలన్నీ తీర్చేశాను’ అన్నారు. దీంతో నాగార్జున పై వస్తున్న పుకార్లన్నింటికీ అడ్డుకట్ట పడినట్లైంది.