టీజర్ టాక్ : పవర్ఫుల్ గా అదరగొట్టిన నాగ్ ‘ది ఘోస్ట్’ గ్లింప్స్ టీజర్ ….!!

Published on Jul 9, 2022 7:30 pm IST

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఇటీవల రాజశేఖర్ తో గరుడ వేగా మూవీ తీసి సూపర్ హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నాగార్జున ఒక పవర్ఫుల్ రోల్ చేస్తుండగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ముకేశ్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి భరత్ సౌరభ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక ది ఘోస్ట్ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది యూనిట్. కిల్లింగ్ మెషిన్ అనే కాన్సెప్ట్ తో తెరక్కుతున్న ఈ మూవీ గ్లింప్స్ టీజర్ నిజంగా అదిరిపోయింది అనే చెప్పాలి. ఎదురుగా వరుసగా వస్తున్న దుండగుల్ని పదునైన కత్తితో చాకచక్యంగా హీరో నాగ్ ఒక్కొక్కరిని చంపడం, అనంతరం ఆయన పేస్ లుక్ ని లైట్ వెలుతురులో చూపించి వెనుక నుండి ఘోస్ట్ అంటూ బీజీఎమ్ రావడాన్ని బట్టి చూస్తే ఈ మూవీ కూడా పవర్ఫుల్ రేంజ్ యాక్షన్ తో అదిరిపోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతూ అందరినీ ఆకట్టుకుంటూ కొనసాగుతోంది. ఇక ఈ మూవీని అక్టోబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు టీజర్ లో యూనిట్ ప్రకటించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :